లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం మిల్లినియం నూతన సెక్రటరీగా లయన్ పగడాల నగేష్ ఏకగ్రీవ ఎన్నిక
పరివర్తన అవాజ్. కొత్తగూడెం, మే 16సామాజిక సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన 7వ నెంబర్ బజారు, 15వ డివిజన్‌కు చెందిన లయన్ పగడాల నగేష్‌ను లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం మిల్లినియం నూతన సెక్రటరీగా 2026-2027 సంవత్సరానికి జరిగిన క్లబ్ జనరల్ బాడీ సమావేశంలో సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం విశేషంగా నిలిచింది. సేవే ధ్యేయంగా ముందుకు సాగుతున్న లయన్స్ క్లబ్‌లో నగేష్ గత కొంతకాలంగా వివిధ సేవా కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొంటూ క్లబ్ అభివృద్ధికి విశేష కృషి చేశారు....