Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 10 May 2026, 5:34 pm Posted by : laxman RAO

మాలల న్యాయ పోరాట సభ విజయవంతం

 

ఎస్సీ వర్గీకరణ రద్దు చేసి సమన్యాయం చేయాలని డిమాండ్

పరివర్తన అవాజ్ ,కొత్తగూడెం తెలంగాణ ఎడ్యుకేట్స్ అసోసియేషన్ ఫర్ మాల (TEAM) ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ, రోస్టర్ విధానం వల్ల మాలలకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తూ కొత్తగూడెంలోని జి.ఎస్. మినీ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన “మాలల న్యాయ పోరాట సభ” విజయవంతంగా ముగిసిందని నిర్వాహకులు తెలిపారు.ఈ సభకు శనగ వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో మాలల రాజ్యాధికార సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు డా. దాసరి చెన్నకేశవులు, జేఎన్‌టీయూహెచ్ జేఏసీ చైర్మన్ డా. రంజిత్ కుమార్ మందా, భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆచార్య డా. మద్దెల శివకుమార్, మాలమహానాడు సెక్రటరీ జనరల్ మధుసూదన్ (చిన్ని), మాలమహానాడు జిల్లా అధ్యక్షులు దాసరి శేఖర్, నవతన్ తదితరులు పాల్గొన్నారు.అలాగే కొత్తగూడెం కార్పొరేషన్ కార్పొరేటర్లు పోలుమూరి ధనలక్ష్మి, నామా కీర్తి, గుర్రం వెంకటేశ్వర్లు, ఆకునూరి సుప్రియ, మద్దాల హరిత, కాల్వ భాస్కర్, కాంగ్రెస్ నాయకులు తంబళ్ల సామెల్, బాలశౌరి, తెలంగాణ ఎడ్యుకేట్స్ అసోసియేషన్ కమిటీ సభ్యులు దాసరి రమేష్, కాకెళ్లి సైమన్, ధామళ్ళ శోభారాణి, శనగ రాంచందర్, మెంటం బలరాం, శెట్టి కమలాకర్, పంతగాని రాజశేఖర్, యర్రముచ్చు కళ్యాణ్, నామా వినోద్, వాడపల్లి రమేష్ బాబు, గడ్డం రాఘన బాబు, శనగ స్వామి, బరగాడి దేవదానం, గుర్రం లక్ష్మయ్య తదితరులు హాజరయ్యారు.సభలో మాట్లాడిన నాయకులు ఎస్సీ వర్గీకరణ వల్ల మాలలు విద్య, ఉద్యోగాలు, ప్రమోషన్లలో తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి ఎస్సీ గ్రూప్-3లో ఉన్న మాల మరియు మాల ఉపకులాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ప్రధాన డిమాండ్లు

  • శాస్త్రీయ ఆధారాలు లేకుండా అమలు చేసిన ఎస్సీ వర్గీకరణను వెంటనే రద్దు చేయాలి.
  • సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఎంపిరికల్ డేటా ఆధారంగా వర్గీకరణ చేపట్టాలి.
  • ఆర్థికంగా అభివృద్ధి చెందిన వారిని ఒక గ్రూప్‌గా, వెనుకబడిన వారిని మరో గ్రూప్‌గా విభజించి ఎస్సీలలోని 59 కులాలకు సమన్యాయం చేయాలి.
  • ఎస్సీ వర్గీకరణ కారణంగా మాల విద్యార్థులకు అడ్మిషన్లలో జరిగిన అన్యాయాలను సరిదిద్దాలి.
  • రోస్టర్ విధానం వల్ల తగ్గిన ఉద్యోగ అవకాశాలను పునరుద్ధరించాలి.
  • ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రమోషన్లలో మాలలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించాలి.
  • ఎస్సీ రిజర్వేషన్ శాతాన్ని 18 శాతానికి పెంచాలి.
  • 20 లోపు రోస్టర్ పాయింట్లలో మాలలకు 3, 12 పాయింట్లు కేటాయించాలి.
  • ఎస్సీ కార్పొరేషన్ రుణాలను వెంటనే విడుదల చేయాలి.
  • షమీమ్ అక్తర్ ఏకసభ్య కమిషన్ నివేదిక, ఎంపిరికల్ డేటాను ప్రజలకు అందుబాటులో ఉంచాలి.
  • 2011 జనాభా లెక్కలతో పోలిస్తే 2024లో మాల జనాభా తగ్గుదలకు గల కారణాలను ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేశారు.

చివరగా, మాల సంఘాల నాయకులు ఐక్యంగా పోరాడి మాలల హక్కులను సాధించుకుంటామని స్పష్టం చేశారు.