మాలల న్యాయపోరాట సభకు సన్నాహాలు
కొత్తగూడెంలో కరపత్రం ఆవిష్కరణ – ఎస్సీ ఉపవర్గీకరణపై మాల సంఘాల ఐక్య స్వరం పరివర్తన ఆవాజ్,కొత్తగూడెం ఎస్సీ ఉపవర్గీకరణ అంశంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో, మాల సంఘాలు తమ న్యాయమైన హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో మే 10న కొత్తగూడెంలోని జి.ఎస్. మినీ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించనున్న “మాలల న్యాయపోరాట సభ”కు సంబంధించిన కరపత్రాన్ని గురువారం సింగరేణి కాలరీస్ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ కార్యాలయంలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం తొందరపాటు...