భద్రాద్రి  కొత్తగూడెం పాల్వంచ బాలికల గురుకుల పాఠశాలలో పకడ్బందీగా నీట్ (యూజీ) పరీక్ష నిర్వహణ

    పాల్వంచ/కొత్తగూడెం, మే 3: దేశవ్యాప్తంగా నేడు జరుగుతున్న నీట్ (యూజీ) ప్రవేశ పరీక్ష పాల్వంచలోని టీజీఎస్‌డబ్ల్యుఆర్‌ఎస్ జూనియర్ కాలేజీ (గురుకుల పాఠశాల)లో పకడ్బందీగా జరిగింది. ఉదయం నుంచే పరీక్ష కేంద్రం వద్ద సందడి నెలకొంది. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు సమయానికి ముందుగానే కేంద్రానికి చేరుకున్నారు. తల్లిదండ్రులు కూడా ముందస్తుగా వచ్చి, పరీక్ష నిబంధనలను పాటిస్తూ తమ పిల్లలను సెంటర్‌లోకి పంపించారు. అధికారులు విద్యార్థుల తనిఖీలు కఠినంగా నిర్వహించి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. పరీక్ష కేంద్రం వద్ద భద్రతా...