ప్రశాంతంగా ముగిసిన నీట్ (యూ జి) పరీక్షలు ఊపిరి పీల్చుకున్న తల్లిదండ్రులు
కొత్తగూడెం/పాల్వంచ, మే 3: దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ (యూ జి) ప్రవేశ పరీక్షలు ఆదివారం ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. స్థానికంగా ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేయడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. పరీక్షకు హాజరైన విద్యార్థులు ఉదయం నుంచే కేంద్రాలకు చేరుకుని, నిర్దేశిత నిబంధనల ప్రకారం తనిఖీలు పూర్తి చేసి హాళ్లలోకి ప్రవేశించారు. సెక్యూరిటీ తనిఖీలు కఠినంగా నిర్వహించడంతో పరీక్షలు సవ్యంగా జరిగాయి. పరీక్ష ముగిసిన అనంతరం విద్యార్థులు కేంద్రాల నుండి బయటకు రాగా, తల్లిదండ్రులు ఊపిరి...