
పరివర్తన అవాజ్ కొత్తగూడెం, మే 24
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం ప్రెస్ క్లబ్‌లో తెలంగాణ రాష్ట్ర యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ) జిల్లా తృతీయ మహాసభలు ఉత్సాహభరితంగా నిర్వహించబడ్డాయి. జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో పాత్రికేయులు, యూనియన్ ప్రతినిధులు, సీనియర్ జర్నలిస్టులు హాజరై సభను విజయవంతం చేశారుమహాసభల్లో మాట్లాడిన సీనియర్ జర్నలిస్టులు, యూనియన్ నాయకులు సమాజానికి మీడియా రంగం చేస్తున్న సేవలను ప్రస్తావిస్తూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో జర్నలిస్టుల బాధ్యత కీలకమని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తేవడం, ప్రభుత్వ విధానాలను ప్రజలకు చేరవేయడం వంటి బాధ్యతలను పాత్రికేయులు నిబద్ధతతో నిర్వహిస్తున్నారని అన్నారు.అయితే ప్రస్తుత పరిస్థితుల్లో జర్నలిస్టులు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా వృత్తిపరమైన భద్రత, ప్రభుత్వ గుర్తింపు, ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాల్లో సమస్యలు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం జర్నలిస్టులు సంఘటితంగా ముందుకు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.యువ జర్నలిస్టులు నైతిక విలువలు, వృత్తి నిబద్ధతను కాపాడుతూ నిజాయితీతో వార్తలను అందించాలని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు. అలాగే జిల్లా స్థాయిలో యూనియన్ బలోపేతం, పెండింగ్ సమస్యల పరిష్కారం, జర్నలిస్టుల సంక్షేమ చర్యలపై పలు తీర్మానాలు చర్చకు వచ్చాయి. మహాసభలు జర్నలిస్టుల ఐక్యతకు వేదికగా నిలిచాయి.