బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వ్యాఖ్యల ను ఖండించిన సుప్రియ
పరివర్తన అవాజ్,కొత్తగూడెం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును భారత్–పాకిస్తాన్ విభజనతో పోలుస్తూ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన అనుచిత వ్యాఖ్యలపై కొత్తగూడెం 15వ డివిజన్ కార్పొరేటర్ ఆకునూరి సుప్రియ ఖండించారు..పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును, అప్పటి యూపీఏ ప్రభుత్వం అనుసరించిన ప్రజాస్వామ్య ప్రక్రియను భారత్–పాకిస్తాన్ విభజనతో పోల్చడం పూర్తిగా తప్పు అని ఆమె ఖండించారు. వందలాది మంది బలిదానాలు, దశాబ్దాల పోరాటం తర్వాత సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని దేశ విభజనతో పోల్చడం తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అవమానించడం అని పేర్కొన్నారు.అప్పటి యూపీఏ ప్రభుత్వం,...