ప్రధాన మంత్రి సూర్యఘర్ ముక్తి బిజిలీ యోజనను సద్వినియోగం చేసుకోవాలి – జిల్లా కలెక్టర్ అంకిత్

పరివర్తన అవాజ్,కొత్తగూడెం సోమవారం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో *ప్రధాన మంత్రి సూర్యఘర్ ముక్తి బిజిలీ యోజన పథకంపై అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అంకిత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి సూర్యఘర్ ముక్తి బిజిలీ యోజనను జిల్లాలో అర్హులైన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ పథకం ద్వారా ఇళ్ల పైభాగంలో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవడం ద్వారా విద్యుత్ ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవచ్చని, స్వయం విద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతుందని తెలిపారు.సోలార్ విద్యుత్...