టేకులపల్లిలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

పరివర్తన అవజ్ న్యూస్ ఏప్రిల్ 11  (టేకులపల్లి ): టేకులపల్లి మండల కేంద్రంలో Jyotirao Phule 199వ జయంతిని ఏపీఎంకే ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎంకే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెంతెన ప్రభాకర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మేకల సతీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, మహాత్మా జ్యోతిరావు పూలే మహారాష్ట్రకు చెందిన ప్రముఖ సామాజిక సంస్కర్త, రచయిత మరియు విప్లవాత్మక నాయకుడని పేర్కొన్నారు. ఆయన తన సహచరురాలు Savitribai Phuleతో కలిసి స్త్రీల విద్య, దళిత వర్గాల అభ్యున్నతి, అంటరానితనం...