Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 06 April 2026, 1:37 pm Posted by : laxman RAO

చుంచుపల్లి నూతన ఎమ్మార్వో కూచిపూడి  నాగరాజుకు సన్మానం

 

సన్మానం చేసిన మనం దినపత్రిక విలేకరులు శనగ లక్ష్మణ్, చదలవాడ సూరి

పరివర్తన ఆవాజ్ ,కొత్తగూడెం

చుంచుపల్లి మండలానికి నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎమ్మార్వో నాగరాజును స్థానిక ప్రముఖులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మనం దినపత్రిక విలేకరులు శనగ లక్ష్మణ్, చదలవాడ సూరి కలిసి నాగరాజుకు సాలువా కప్పి అభినందనలు తెలిపారు.మండల అభివృద్ధి కోసం సమన్వయంతో పనిచేయాలని, ప్రజల సమస్యలను ప్రాధాన్యంగా తీసుకుని పరిష్కరించాలని వారు కోరారు. ఎమ్మార్వోగా బాధ్యతలు స్వీకరించిన నాగరాజు సమర్థవంతంగా విధులు నిర్వర్తించి ప్రజలకు అందుబాటులో ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మార్వో నాగరాజు మాట్లాడుతూ, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకుల సహకారంతో మండలంలో పారదర్శక పాలన అందిస్తానని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉంటానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానికులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.