Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 19 March 2026, 2:02 pm Posted by : laxman RAO

శ్రీ ఉమామహేశ్వర స్వామివారి దేవాలయం (శివాలయం) ప్రగతి నగర్ లో కోటికుంకుమార్చనా మహాయాగము ఈరోజు ప్రారంభోత్సవం జరిగింది బ్రహ్మశ్రీ కొండవీటి దత్తాత్రేయ శర్మ ఆధ్వర్యంలో

 

పరివర్తన అవాజ్,కొత్తగూడెం

స్వస్తిశ్రీ చాంద్రమానేన శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది నుండి శ్రీరామనవమి పర్యంతము అనగా ది. 19-3-2026 గురువారం నుండి ది. 28-3-2026 శనివారం వరకు సకల భక్తజనుల రక్షణార్ధం సకల ప్రజలకు సౌభాగ్య, ఆరోగ్య, ఆనంద, ఐశ్వర్యము కలుగాలనే సంకల్పముతో పంచాయతన సహితముగా కోటికుంకుమార్చనా మహాయాగమును నిర్వహించటం జరుగుతున్నది. కావున భక్త జనులందరూ ఈ దైవ కార్యక్రమములో పాల్గొని అమ్మవారిని దర్శించి, పూజించి, సేవించి జగదాంబ అనుగ్రహమునకు పాత్రులై సౌభాగ్య, ఆరోగ్య, ఆనంద ఐశ్వర్యములు పొందగలరు.

పంచాయతన సహిత కోటికుంకుమార్చన మహాయాగం

బ్రహ్మశ్రీ కొండవేటి దత్తాత్రేయ శర్మ మంత్ర శాస్త్రపండితులు వారి ఆధ్వర్యములో నిర్వహించబడును.

కోటి కుంకుమార్చన నిర్వహించు ప్రదేశం :

శ్రీ ఉమామహేశ్వర స్వామివారి దేవాలయం (శివాలయం) ప్రగతి నగర్, కొత్తగూడెం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యాగమును విజయవంతం చేయగలరని మనవి.