విద్యానగర్ కాలనీ న్యూ లైఫ్ హాస్పిటల్ 19వ డివిజన్‌ గర్భిణీలకు ఉచిత డెలివరీ సేవలు

పరివర్తన అవాజ్,కొత్తగూడెం19వ డివిజన్ పరిధిలోని అర్హులైన గర్భిణీ స్త్రీలకు ఉచిత డెలివరీ సేవలు అందించబడనున్నాయని 19వ డివిజన్ కార్పొరేటర్ స్వప్న శంకర్ నాయక్ వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల సరైన వైద్యసేవలు పొందలేకపోతున్న గర్భిణీలకు చేయూతనివ్వాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. సోమవారం చుంచుపల్లి మండలం విద్య నగర్ కాలనీ లో గల న్యూ లైఫ్ హాస్పిటల్‌లో చిట్టి రామవరం తండకు చెందిన భూక్య వెన్నెలకు పూర్తిగా ఉచితంగా సురక్షిత డెలివరీ నిర్వహించామని పేర్కొన్నారు. తల్లి–శిశు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అవసరమైన వైద్యసేవలను...