Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 12 March 2026, 10:28 am Posted by : laxman RAO

మార్చి 28న భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా జరిగే జాతీయ లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోండి.

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, భద్రాద్రి కొత్తగూడెం

 జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్

పరివర్తన అవాజ్,కొత్తగూడెం:-తెలనగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు, ఈ నెల **మార్చి 28న (శనివారం)** భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని కోర్టులలో **జాతీయ లోక్ అదాలత్** నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కార్యదర్శి ఎం రాజేందర్ గురువారం ఒక ప్రకటన లొ వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కక్షిదారులు తమ పెండింగ్ కేసులను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ ఒక అద్భుతమైన అవకాశమని పేర్కొన్నారు.
* రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు
* చెక్ బౌన్స్ కేసులు (NI Act cases)
* బ్యాంకు రికవరీ కేసులు
* మోటార్ వాహన ప్రమాద నష్టపరిహార కేసులు (MVOP)
* వివాహ బంధానికి సంబంధించిన కేసులు
* ఆస్తి పంపకాల వివాదాలు, అద్దె వివాదాలు మరియు ఇతర సివిల్ కేసులు
* డ్రంక్ అండ్ డ్రైవ్ మరియు ఇ – చలాన్ కేసులు
* సైబర్ క్రైమ్ కేసులు
* చిన్న చిన్న దొంగతనం కేసులు
* టెలిఫోన్ కేసులు
* మనోవర్తి కేసులు
* కొట్టుకున్న కేసులు
మొదలైన కేసులను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగే పని లేకుండా తక్షణమే తుది తీర్పు లభిస్తుందని తెలిపారు. ఇక్కడ గెలుపోటములు ఉండవని, ఇరుపక్షాల అంగీకారంతోనే నిర్ణయం జరుగుతుందని అన్నారు. దీనిపై మళ్ళీ అప్పీలుకు వెళ్లే అవకాశం ఉండదని తెలిపారు.
జిల్లాలోని కక్షిదారులు, ప్రతివాదులు తమ న్యాయవాదుల ద్వారా లేదా నేరుగా సంబంధిత కోర్టులలో సంప్రదించి తమ కేసులను లోక్ అదాలత్ జాబితాలో చేర్చుకోవాలని మరియు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కోర్టుల చుట్టూ తిరిగే శ్రమను, ఖర్చును తగ్గించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కోరారు.