మహిళను బెదిరించి నగదు దోచుకున్న ఇద్దరు నిందితులు అరెస్ట్ – మాచారెడ్డి పోలీసుల చాకచక్యం
మహిళను బెదిరించి నగదు దోచుకున్న ఇద్దరు నిందితులు అరెస్ట్ – మాచారెడ్డి పోలీసుల చాకచక్యం వాహన తనిఖీల్లో పట్టుబడ్డ నిందితులు, నగదు-బైక్ స్వాధీనం కామారెడ్డి, మార్చి 24 (అవాజ్ న్యూస్): మాచారెడ్డి మండలంలో మహిళను బెదిరించి నగదు దోచుకున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి చాకచక్యంగా కేసును ఛేదించారు. ఈ నెల 23న అక్కపూర్ గ్రామానికి చెందిన హరి రాజవ్వ (62) మాచారెడ్డి చౌరస్తా వద్ద కొనుగోలు కోసం వెళ్లి తిరిగి ఇంటికి నడుచుకుంటూ వస్తుండగా, ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి...