Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 24 March 2026, 2:24 pm Posted by : parivarthanaawaaz

నరసన్నపల్లి మాదిగల గ్రామ బహిష్కరణపై వినతి పత్రం

నరసన్నపల్లి మాదిగల గ్రామ బహిష్కరణపై వినతి పత్రం?

{కామారెడ్డి పరివర్తన ఆవాజ్} నర్సన్నపల్లి ఎస్సీ మాదిగ కులస్తులను గ్రామ నివాసులను గ్రామ బహిష్కరణ చేయుట గురించి జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ కి వివిధ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా భీమ్ ఆర్మీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు గడ్డం రవి, మాదిగ రాజకీయ పోరాట సమితి రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ భాగయ్య, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి వెంకట రాములు, ఎమ్మార్పీఎస్ మహిళా జిల్లా అధ్యక్షురాలు సత్తిగారి లక్ష్మి, ఏలూరి స్వామి మాట్లాడుతూ కామారెడ్డి మండలంలోని నరసన్నపల్లి గ్రామ ఎస్సీ మాదిగ కులస్తులను ఉగాది పండుగ రోజున అవమానించడమే కాకుండా, మా కుల దైవమైనటువంటి పోచమ్మ దేవాలయానికి సున్నం వేయలేదని , దానికి ముఖ్య కారణమైన గ్రామ సర్పంచ్ రవి, రజక కులస్తులైన బక్కోళ్ల సిద్దిరాములు, బక్కోళ్ల అంజయ్యలతో ఫోన్లో మాట్లాడిన వాయిస్ రికార్డు ఉందని,ఈనెల 18 తేదీన జరిగిన విషయం పైన దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఇట్టి విషయం పైన జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగిందని, జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ సానుకూలంగా స్పందించి ఈనెల 30 తేదీన మాదిగ కులస్తులను అన్ని దేవాలయంలోకి నేనే తీసుక వెళ్తానని మాట ఇచ్చారని తెలిపారు. మీయొక్క సమస్యలు పరిష్కారం చేస్తామని తెలిపారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాదిగ రాజకీయ పోరాట సమితి జిల్లా అధ్యక్షులు చిట్యాల సాయన్న, దళిత సైన్యం వర్కింగ్ ప్రెసిడెంట్ కొత్తపల్లి సుధాకర్, లెగ్గిల రాజు, రాజశేఖర్ ఏలూరి రాజు, నరసన్నపల్లి ఎస్సీ మాదిగ కులస్తులు పాల్గొన్నారు.