డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం రామవరం ప్రజల భారీ అవగాహన ర్యాలీ

పరివర్తన అవాజ్,కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల యాక్షన్ ప్లాన్ కార్యక్రమంలో భాగంగా “పిల్లల భద్రత – డ్రగ్స్‌కు అడ్డుకట్ట, డ్రగ్స్ రహిత తెలంగాణ మన అందరి బాధ్యత” అనే నినాదంతో భారీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా రామవరం ప్రాంతానికి చెందిన ప్రజలు, యువకులు, మహిళలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని మానవహారం ఏర్పాటు చేసి ర్యాలీ నిర్వహించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని నినాదాలు చేస్తూ యువతలో చైతన్యం కల్పించారు. అనంతరం డ్రగ్స్‌కు...