Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 21 March 2026, 7:28 am Posted by : laxman RAO

అభివృద్ధిలో అలుపెరుగని నాయకుడు – నందా తండా సర్పంచ్ మాలోత్ బలరాం

పరివర్తన అవాజ్,కొత్తగూడెం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలోని నందా తండా గ్రామంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. గ్రామ సర్పంచ్ మాలోత్ బలరాం నాయకత్వంలో గ్రామంలో శుభ్రత మరియు మౌలిక సదుపాయాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.గత కొన్ని సంవత్సరాలుగా పేరుకుపోయిన చెత్త మరియు మురుగునీటి సమస్య గ్రామ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగించేది. ఈ సమస్యలను గుర్తించిన సర్పంచ్ మాలోత్ బలరాం వెంటనే చర్యలు చేపట్టి, గ్రామంలోని ప్రధాన వీధులు, కాలువలు, చెత్త పేరుకుపోయిన ప్రదేశాలను శుభ్రపరిచే కార్యక్రమాన్ని ప్రారంభించారు.ప్రస్తుతం గ్రామంలో ప్రత్యేక బృందాల ద్వారా చెత్త తొలగింపు, మురుగు నీటి కాలువల శుభ్రపరిచే పనులు వేగంగా కొనసాగుతున్నాయి. దీంతో గ్రామంలో పరిశుభ్రత మెరుగుపడటమే కాకుండా, దోమలు, వ్యాధుల ప్రమాదం కూడా తగ్గుముఖం పట్టింది.ఈ కార్యక్రమంపై గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ, సర్పంచ్ మాలోత్ బలరాం తీసుకుంటున్న చర్యలను అభినందిస్తున్నారు. గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న నాయకుడిగా ఆయనకు మంచి పేరు వస్తోంది.గ్రామాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా మార్చేందుకు ఇలాంటి చర్యలు మరింత కొనసాగించాలని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.