58వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి గా కాంగ్రెస్ బీఫామ్ అందుకున్న ఎండి దావూద్
పరివర్తన అవాజ్ ,కొత్తగూడెం: మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో 58వ డివిజన్‌లో రాజకీయ వేడి మరింత పెరిగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున 58వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా ఎండి దావూద్‌కు పార్టీ బీఫామ్ అందజేశారు. ఈ బీఫామ్‌ను డీసీసీ అధ్యక్షురాలు దేవి ప్రసన్న, ఐవైసీ అధ్యక్షుడు చీకటి కార్తీక్ అందజేశారు. ఈ సందర్భంగా ఎండి దావూద్ మాట్లాడుతూ, 58వ డివిజన్ ప్రజల ఆశీస్సులతో తాను కార్పొరేటర్‌గా గెలిస్తే డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ప్రజలకు అత్యవసరమైన తాగునీరు, రోడ్లు, కరెంట్, శానిటేషన్ వంటి మౌలిక...