Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 03 February 2026, 12:26 pm Posted by : laxman RAO

58వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి గా కాంగ్రెస్ బీఫామ్ అందుకున్న ఎండి దావూద్

పరివర్తన అవాజ్ ,కొత్తగూడెం: మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో 58వ డివిజన్‌లో రాజకీయ వేడి మరింత పెరిగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున 58వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా ఎండి దావూద్‌కు పార్టీ బీఫామ్ అందజేశారు. ఈ బీఫామ్‌ను డీసీసీ అధ్యక్షురాలు దేవి ప్రసన్న, ఐవైసీ అధ్యక్షుడు చీకటి కార్తీక్ అందజేశారు.

ఈ సందర్భంగా ఎండి దావూద్ మాట్లాడుతూ, 58వ డివిజన్ ప్రజల ఆశీస్సులతో తాను కార్పొరేటర్‌గా గెలిస్తే డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ప్రజలకు అత్యవసరమైన తాగునీరు, రోడ్లు, కరెంట్, శానిటేషన్ వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. అలాగే ప్రజలకు అవసరమైన సర్టిఫికెట్లు మరియు ఇతర సేవలు సులభంగా అందేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

డివిజన్ ప్రజలు తనపై నమ్మకం ఉంచి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఎండి దావూద్ విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొని అభ్యర్థికి మద్దతు తెలిపారు.