Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 10 February 2026, 7:41 am Posted by : laxman RAO

53వ డివిజన్‌లో ప్రచార జోష్


ముదంగుల మహేష్ గెలుపు లక్ష్యంగా ఇంటింటి ప్రచారం

పరివర్తన అవాజ్,కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కార్పొరేషన్ ఎన్నికల వేడి రోజురోజుకూ పెరుగుతోంది. 53వ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి ముదంగుల మహేష్ గెలుపును కాంక్షిస్తూ సోమవారం బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ప్రచారం సందర్భంగా స్థానిక ప్రజలను కలిసి డివిజన్‌లో ఉన్న ప్రధాన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ, విద్యావంతుడు మరియు సేవాభావం కలిగిన యువ నాయకుడు ముదంగుల మహేష్ 53వ డివిజన్ అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నారని తెలిపారు.

మహేష్ గెలుపు కోసం ప్రతి కార్యకర్త, ప్రతి ఓటరు ముందుండి సహకరించాలని పిలుపునిచ్చారు. ప్రచారంతో 53వ డివిజన్‌లో నూతన ఉత్సాహం నెలకొందని, మహేష్‌కు ప్రజల మద్దతు మరింత బలపడుతోందని స్థానికులు పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో అభివృద్ధి, యువ నాయకత్వానికి ప్రజలు అండగా నిలుస్తారని బీఆర్ఎస్ శ్రేణులు విశ్వాసం వ్యక్తం చేశాయి.