23 వ డివిజన్ గెలుపు నాదే అంటున్న కార్పొరేటర్ పోటీ అభ్యర్థి గూగులోత్ విజయలక్ష్మి ధీమా
ఉంగరం గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి కొత్తగూడెం, పరివర్తన అవాజ్:కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో 23వ డివిజన్ కార్పొరేటర్‌గా కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గూగులోత్ విజయలక్ష్మి గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. వార్డు ప్రజల ఆశీస్సులు, మద్దతుతో విజయాన్ని సాధిస్తానని తెలిపారు. వార్డుల అభివృద్ధి, పారదర్శక పరిపాలన, ప్రజలకు అందుబాటులో ఉండే సేవలే తన ప్రధాన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. అవినీతి రహిత పాలన అందిస్తూ ప్రతి కుటుంబ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని...