18వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా మాతంగి దివ్యకు పార్టీ అధికారికంగా బీఫామ్ అందజేత

పరివర్తన అవాజ్:-కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో 18వ డివిజన్‌లో రాజకీయ ఉత్సాహం నెలకొంది. కాంగ్రెస్ పార్టీ తరఫున 18వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా మాతంగి దివ్యకు పార్టీ అధిష్టానం అధికారికంగా బీఫామ్ అందజేసింది. ఈ బీఫామ్‌ను డిసిసి అధ్యక్షురాలు దేవి ప్రసన్న మరియు ఐవైసీ అధ్యక్షుడు చీకటి కార్తీక్ అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మాతంగి దివ్యకు బీఫామ్ అందజేసిన అనంతరం ఆమె మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని...