Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 02 February 2026, 8:45 am Posted by : laxman RAO

హౌసింగ్ బోర్డులో ఘనంగా బోనాల కార్యక్రమం

పరివర్తన అవాజ్ :-హౌసింగ్ బోర్డు ప్రాంతంలో సమ్మక్క–సారక్క గుడి నుంచి ముత్యాలమ్మ గుడి వరకు బోనాల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు.గుడి పూజారి హగ్ మేర సోను ఆధ్వర్యంలో సమ్మక్క–సారక్క గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి, బోనం బోనం ఎత్తుకొని భక్తులు ముత్యాలమ్మ గుడికి తరలివెళ్లారు.ఈ సందర్భంగా భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకుని, పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బోనాల ఊరేగింపు సందర్భంగా డప్పుల చప్పుళ్లు, మహిళల కోలాటాలు, భక్తుల నినాదాలతో ప్రాంతమంతా భక్తిశ్రద్ధలతో మార్మోగింది.ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి కృప పొందారు. స్థానికులు, మహిళలు, యువతీ యువకులు పెద్ద ఎత్తున పాల్గొనడంతో కార్యక్రమం ఉత్సవ వాతావరణంలో కొనసాగింది.