27 డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి మద్దాల హరితకు సిపిఐ బీ-ఫారం అందజేత
పరివర్తన అవాజ్, కొత్తగూడెం:-కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 27వ డివిజన్‌లో సీపీఐ పార్టీ కార్యకలాపాలు వేగవంతమవుతున్నాయి. ఈ సందర్భంగా 27వ డివిజన్ ఇన్‌చార్జ్‌లుగా ఉన్న ఎక్స్-ఎంపీటీసీ దుర్గరాశి వెంకన్న మరియు ఎక్స్-ఎంపీపీ దుర్గరాశి లక్ష్మి ఆధ్వర్యంలో ఈరోజు సీపీఐ పార్టీ రాష్ట్ర నాయకుడు ఎమ్మెల్యే కునంనేని సాంబశివరావు చేతుల మీదుగా కార్పొరేటర్ అభ్యర్థి మద్దాల హరితకు బీ-ఫారం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ, 27వ డివిజన్ అభివృద్ధి కోసం మద్దాల హరిత కృషి చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజలు...