రామవరం 14వ డివిజన్‌లో కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం ఉద్ధృతం

చేయి గుర్తుపై ఓటు వేసి విశ్వనాధ్‌ను గెలిపించాలని పిలుపు పరివర్తన ఆవాజ్,కొత్తగూడెం టౌన్:-రామవరం 14వ డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటి ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రతి వీధి, ప్రతి ఇంటిని సందర్శిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, పార్టీ చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… గతంలో కాంగ్రెస్ పాలనలో అమలైన ప్రజా సంక్షేమ పథకాలు పేద, మధ్యతరగతి వర్గాలకు ఎంతగానో ఉపయోగపడ్డాయని తెలిపారు. ప్రస్తుతం స్థానికంగా నెలకొన్న మౌలిక వసతుల...