రామవరం ప్రజలకు తక్షణం మంచినీటి సరఫరా చేయాలి: కాంగ్రెస్ నాయకుడు మోరే రమేష్ కుమార్ డిమాండ్
పరివర్తన అవాజ్,కొత్తగూడెం:-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 17వ డివిజన్ పరిధిలోని రామవరం ప్రాంతంలో తాగునీటి సమస్య తీవ్రంగా మారిందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు మోరే రమేష్ కుమార్ ఆరోపించారు. గత ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన రాష్ట్ర ప్రభుత్వ మిషన్ భగీరథ పథకం కింద దాదాపు రూ.3 కోట్లతో, అలాగే కేంద్ర ప్రభుత్వ జల్ యోజన పథకం కింద రూ.8 కోట్ల వ్యయంతో ఎనిమిది లక్షల లీటర్ల సామర్థ్యం గల భారీ వాటర్ ట్యాంక్ నిర్మించినప్పటికీ, ఇప్పటివరకు ప్రజలకు...