బహుజన రాజ్య స్థాపనతోనే పేదలకు అభివృద్ధి సాధ్యం – కురిమెల్ల శంకరయ్య

పరివర్తన అవాజ్,కొత్తగూడెం:-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి కురిమెల్ల శంకరయ్య మాట్లాడుతూ, బహుజన రాజ్య స్థాపన ద్వారానే సమాజంలో అణగారిన వర్గాలకు న్యాయం, అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం రావాలంటే అధికారంలోకి బహుజనులే రావాలని ఆయన స్పష్టం చేశారు.ప్రస్తుత పాలకుల నిర్లక్ష్యంతో ప్రజలు మౌలిక వసతుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా పేదలకు విద్య, వైద్యం, ఉపాధి, నివాసం వంటి మౌలిక హక్కులు దూరమవుతున్నాయని ఆవేదన...