Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 04 February 2026, 2:23 pm Posted by : laxman RAO

బహుజన రాజ్య స్థాపనతోనే పేదలకు అభివృద్ధి సాధ్యం – కురిమెల్ల శంకరయ్య

పరివర్తన అవాజ్,కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి కురిమెల్ల శంకరయ్య మాట్లాడుతూ, బహుజన రాజ్య స్థాపన ద్వారానే సమాజంలో అణగారిన వర్గాలకు న్యాయం, అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం రావాలంటే అధికారంలోకి బహుజనులే రావాలని ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుత పాలకుల నిర్లక్ష్యంతో ప్రజలు మౌలిక వసతుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా పేదలకు విద్య, వైద్యం, ఉపాధి, నివాసం వంటి మౌలిక హక్కులు దూరమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైనేజీ, రహదారులు, తాగునీరు, వీధి దీపాల వంటి సమస్యలు ఇంకా అనేక ప్రాంతాల్లో పరిష్కారం కాలేదన్నారు.
బహుజన సమాజ్ పార్టీ అధికారంలోకి వస్తే పేదలకు ఉచిత విద్య, నాణ్యమైన వైద్యం, సంక్షేమ పథకాల అమలు పారదర్శకంగా జరుగుతుందని తెలిపారు. ప్రజలు మార్పు కోరుకుంటే ఏనుగు గుర్తుపై ఓటు వేసి బహుజన అభ్యర్థులను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నా