Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 03 February 2026, 2:57 pm Posted by : laxman RAO

పోలీస్ జాగిలాలతో గంజాయి హాట్స్పాట్స్ తనిఖీలు

పరివర్తన అవాజ్ ,కొత్తగూడెం :-జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాలతో కొత్తగూడెం డిఎస్పి ఆదినారాయణ సూచనలతో కొత్తగూడెం త్రీ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో మంగళవారం పోలీస్ స్టేషన్ పరిధిలోని గంజాయి హాట్స్పాట్స్ తనిఖీలు నిర్వహించారు.కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి హాట్స్పాట్స్ గా గుర్తించబడిన ప్రదేశాలలో ఈ తనిఖీలు చేపట్టడం జరిగిందని త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి తెలిపారు.ఈ తనిఖీలను నిర్వహించడం కోసం మత్తు పదార్థాలను కనిపెట్టే పోలీస్ జాగిలాలను ఉపయోగించడం జరిగిందని వివరించారు.ఎవరైనా గంజాయి సరఫరా చేస్తున్నట్లుగానీ, అక్రమ రవాణా చేస్తున్నట్లుగానీ,సేవిస్తున్నట్లుగానీ తెలిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని సీఐ కోరారు.