Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 26 February 2026, 12:37 pm Posted by : laxman RAO

నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో 2నెలల పసిబిడ్డను హత్య చేసిన` అగ్రకుల పెత్తందారులపై చర్యలు తీసుకోవాలి……. మచ్చా వెంకటేశ్వర్లు CPM భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి*

పరివర్తన ఆవాజ్ కొత్తగూడెం:-నాగర్ కర్నూల్ జిల్లా, కుమ్మెర గ్రామంలో 2026 ఫిబ్రవరి 18న జరిగిన మల్లన్న జాతరలో సిలికేశ్వరం గణేష్, తల్లి చంద్రకళ , భార్య మౌనిక, అక్క కీర్తి దైవ దర్శనం కోసం వెళ్లారు. వీరిని కులం పేరుతో దూషించి, దౌర్జన్యం, దాడి చేసి గణేష్ యొక్క 2నెలల పసి బిడ్డను ఆ గ్రామ అగ్రకుల పెత్తందారులు కులం పేరుతో దూషించి, దౌర్జన్యం, దాడిచేసి మానవమృగాల్లా ప్రవర్తించి, 2 నెలల పసిబిడ్డను హత్య చేశారు. ఈ ఘటన కు బాధ్యులైన వ్యక్తులను, కేసు జాప్యం చేస్తున్న పోలీసుల పై కఠిన చర్యలు తీసుకోవాలని cpm భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మహిళలని కూడా చూడకుండా, నానా బూతులు తిట్టి అవమానించారు. ఇదేమిటని సోషల్ మీడియాలో ప్రశ్నించిన గణేష్‌ను మూడున్నర గంటల పాటు పైన పేర్కొన్న పెత్తందారులు ఒక గదిలో నిర్భంధించి చితకబాదారు. తన భర్తను కొట్టొద్దని కాళ్ళమీద పడి మౌనిక బతిమిలాడి వేడుకున్నా, కాళ్లతో తన్నారే కానీ, కనీసం కనికరించలేదు. ఘటన జరిగి 7 రోజులైనప్పటికీ నేరస్తులందరినీ అరెస్టు చేయలేదని అన్నారు. హత్య జరిగితే అటేమ్ టు మర్డర్ కేసు పెట్టడం అన్యాయం అన్నారు. తక్షణమే 9మంది హంతకును అరెస్టు చేసి, రిమాండ్‌కు పంపి, కఠినంగా శిక్షించాలని కోరారు. హంతకులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్న డీఎస్పీ, సీఐ, ఎసఐలను సస్పెండ్ చేయాలని కోరారు.
ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చూడాలని కోరారు.

కుల వివక్ష దాడులు, హత్యలు, అత్యాచారాలను అరికట్టాలనీ కోరారూ