దూకుడు పెంచిన 58వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ దేవులపల్లి విద్యాసాగర్‌కు ప్రజల బ్రహ్మరథం
విద్యాసాగర్‌కు ప్రజల బ్రహ్మరథం పరివర్తన అవాజ్,కొత్తగూడెం:-భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 58వ డివిజన్‌లో బీజేపీ అభ్యర్థి దేవులపల్లి విద్యాసాగర్ ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన డివిజన్ పరిధిలోని పలు కాలనీలు, బస్తీలు, నివాస ప్రాంతాలను సందర్శిస్తూ ఓటర్లను ప్రత్యక్షంగా కలుస్తున్నారు. ఈ సందర్భంగా విద్యాసాగర్‌కు స్థానిక ప్రజలు విశేష స్పందన చూపుతూ బ్రహ్మరథం పడుతున్నారు. ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్న విద్యాసాగర్ ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుంటూ, వాటి పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తానని హామీ ఇస్తున్నారు....