డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జితేష్ వి. పాటిల్
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మంగళవారం పరిశీలించారు. పరివర్తన అవాజ్,కొత్తగూడెం:-ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని సింగరేణి పాఠశాల ఆవరణలో, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ అనుబోస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో చేపట్టిన ఏర్పాట్లను కలెక్టర్ సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా, ఎన్నికల సామగ్రి పంపిణీ, స్వీకరణ ప్రక్రియలు సజావుగా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పోలింగ్ సిబ్బందికి బ్యాలెట్ బాక్సులు,...