*జిల్లాలో సాయంత్రం 5 గంటల వరకు 73.33% పోలింగ్ నమోదు..*
పోలింగ్ సమయం ముగిసినా క్యూలో ఉన్న ప్రతి ఓటరికి అవకాశం : జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అరివర్తన్ అవాజ్,కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల్లో సాయంత్రం 5 గంటల వరకు మొత్తం 73.33 శాతం పోలింగ్ నమోదైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీ జితేష్ వి. పాటిల్ తెలిపారు. జిల్లాలోని మూడు అర్బన్ లోకల్ బాడీల పరిధిలో మొత్తం 106 వార్డులు, 288 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు....