చర్ల మరియు సత్యనారాయణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలోజ్వర కేసుల నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి (DMHO) సంబంధిత సిబ్బందితో సమీక్ష సమావేశం

పరివర్తన అవాజ్:-చర్ల మరియు సత్యనారాయణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో నమోదవుతున్న జ్వర కేసుల నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి (DMHO) సంబంధిత సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో జ్వర కేసుల నియంత్రణపై పలు కీలక సూచనలు జారీ చేశారు. నమోదైన ప్రతి జ్వర కేసును ప్రతిరోజూ సర్వే చేసి పర్యవేక్షించాలని ఆదేశించారు. ఐఆర్‌ఎస్ స్ప్రేయింగ్ మరియు మలాథియన్ టెక్నికల్ ఫాగింగ్‌ను నాలుగు వారాల పాటు నిర్దిష్ట వ్యవధుల్లో నిర్వహించాలని సూచించారు.రోజువారీ జ్వర సర్వేలను సమగ్రంగా పర్యవేక్షించే బాధ్యత సూపర్వైజింగ్ అధికారికి (SUO)...