కొత్తగూడెం వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ పదవి ఎస్సీలకు కేటాయించాలి
ఏజెన్సీ ఎస్సీ రిజర్వేషన్ పెంపు పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ -మోదుగు జోగారావు పరివర్తన అవాజ్ కొత్తగూడెం: కొత్తగూడెం వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ పదవిని ఎస్సీలకు కేటాయించాలని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మోదుగు జోగారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఏజెన్సీ ప్రాంతాల్లో ఎస్సీలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఎస్సీల ఓట్లను దండుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత, అదే ఏజెన్సీ ప్రాంతంలో ఎస్సీలు లేరన్నట్లుగా వ్యవహరిస్తున్నారని...