కొత్తగూడెం వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిపై కాంగ్రెస్‌లో హోరాహోరీ… కష్టపడ్డ వారికి దక్కుతుందా గౌరవం?
ఆందోళనలో కాంగ్రెస్ ఆశావాలు...? పరివర్తన అవాజ్,కొత్తగూడెం:-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కొత్తగూడెంలో రాజకీయ వేడి మళ్లీ పెరుగుతోంది. వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి కోసం కాంగ్రెస్ పార్టీలో లోపలే తీవ్ర పోటీ నెలకొనడంతో స్థానిక రాజకీయాలు ఉత్కంఠభరితంగా మారాయి. పార్టీ కష్టకాలంలో వీధివీధి తిరిగి జెండాలు మోసిన వారు, అరెస్టులు ఎదుర్కొన్న వారు, ఎన్నికల సమయంలో భుజాలు కాయలయ్యేలా శ్రమించిన కార్యకర్తలు ఇప్పుడు ఒక్క మాటే అంటున్నారు — “ఈసారి అయినా మా కష్టానికి గుర్తింపు దక్కాలి.” ఎన్నికల సమయంలో పార్టీ కోసం...