Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 15 February 2026, 3:30 am Posted by : laxman RAO

కొత్తగూడెం మేయర్ రేస్‌లో బానోతు కళావతి…?

పరివర్తన అవాజ్,కొత్తగూడెం

కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ తొలి మేయర్ పదవిని సిపిఐ పార్టీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. మేయర్ స్థానం ఎస్టీ (జనరల్) వర్గానికి కేటాయించబడిన నేపథ్యంలో, సిపిఐ తరఫున 52వ డివిజన్ కార్పొరేటర్‌గా గెలుపొందిన బానోతు కళావతికి ఆ పదవి దక్కే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది…..? ఈ ఎన్నికల్లో సిపిఐ పార్టీకి చెందిన 22 మంది అభ్యర్థులు కార్పొరేటర్లుగా విజయం సాధించగా, కాంగ్రెస్ పార్టీతో జరిగిన అవగాహన ఒప్పందం ఫలించినట్లు సమాచారం. ఈ క్రమంలో మేయర్ పదవిని సిపిఐ పార్టీ దక్కించుకోగా, డిప్యూటీ మేయర్ పదవిని కాంగ్రెస్ పార్టీకి కేటాయించేలా పరస్పర అంగీకారం జరిగినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

అయితే మేయర్ ఎన్నిక ప్రక్రియ అధికారికంగా పూర్తయ్యే వరకు తుది నిర్ణయం వెలువడాల్సి ఉంది. సంబంధిత ప్రక్రియ అనంతరం అధికారిక ప్రకటన వెలువడనుంది.