కొత్తగూడెం డీఎస్పీని సన్మానించిన టైక్వాండో అసోసియేషన్ సభ్యులు

పరివర్తన అవాజ్,కొత్తగూడెం టౌన్ :-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం డీఎస్పీగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఎల్. ఆదినారాయణను శనివారం టైక్వాండో జిల్లా కార్యదర్శి, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇనీగాల మొగిలి ఆధ్వర్యంలో అసోసియేషన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. గతంలో కొత్తగూడెం త్రీటౌన్ సీఐగా విధులు నిర్వహించిన అనుభవంతో పోలీస్ శాఖలో మంచి గుర్తింపు, మంచి పేరు తెచ్చుకున్నారని కొనియాడారు. అదే తరహాలో కొత్తగూడెం డీఎస్పీగా కూడా ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డీఎస్పీ ఎల్. ఆదినారాయణ మాట్లాడుతూ, భద్రాద్రి...