కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికలు: సీపీఐ నుంచి బిఆర్ఎస్‌లోకి 25 కుటుంబాలు చేరిక

పరివర్తన అవాజ్,కొత్తగూడెం:-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఈ క్రమంలో కొత్తగూడెం 29వ డివిజన్‌లో సీపీఐ పార్టీకి చెందిన 25 కుటుంబాలు బిఆర్ఎస్ పార్టీలో చేరాయి. ఈ కార్యక్రమం టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో జరిగింది. ఈ చేరిక కార్యక్రమాన్ని స్థానిక నాయకుడు వేముల పవన్ కుమార్ సమన్వయం చేశారు. పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు చేరిన కుటుంబ సభ్యులు తెలిపారు....