కాంగ్రెస్‌లోకి ఐదుగురు స్వతంత్ర కార్పొరేటర్లు
-మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో చేరిక పరివర్తన అవాజ్,కొత్తగూడెం కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా విజయం సాధించిన ఐదుగురు కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఖమ్మంలోని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది. మంత్రి పొంగులేటి సమక్షంలో వీరంతా కాంగ్రెస్ పార్టీలో చేరగా, వారికి మంత్రి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో 1వ డివిజన్ కార్పొరేటర్ సీరపు...