కరెంటు మీటర్లు లేక ఎస్సీలకు ఇబ్బందులు… ఎన్పీడీసీఎల్ నిర్లక్ష్యంపై ఆగ్రహం

“125 పథకం” ఇందిరమ్మ రాజ్యంలోనే మాయం?” పరివర్తన అవాజ్ ,కొత్తగూడెం ప్రాంతాల్లో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పలువురు కుటుంబాలు కరెంటు మీటర్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సంవత్సరాలుగా దరఖాస్తులు చేసుకున్నా, అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. విద్యార్థులు చదువులకు ఇబ్బంది పడుతున్నారని, చిన్న వ్యాపారాలు చేసుకునే వారు కూడా విద్యుత్ కనెక్షన్ లేక ఆదాయం కోల్పోతున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎస్సీల సమస్యలపై స్పందించని (ఎన్పీడీసీఎల్) అధికారుల వైఖరిపై...