Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 03 February 2026, 12:17 pm Posted by : laxman RAO

కరుడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్తకు దక్కిన గౌరవం –20 వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి గా బీఫామ్ అందుకున్న బానోతు కోటేష్

 

బీఫామ్ అందజేసిన డిసిసి అధ్యక్షురాలు దేవి ప్రసన్న , ఐవైసి అధ్యక్షుడు చీకటి కార్తీక్

పరివర్తన అవాజ్ :-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి పనిచేస్తున్న కరుడుగట్టిన కార్యకర్త బానోతు కోటేష్‌కు పార్టీ ఉన్నత స్థాయి నుంచి గౌరవం లభించింది. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 20వ డివిజన్‌కు సంబంధించిన కాంగ్రెస్ కార్యకర్త బానోతు కోటేష్‌కు డిసిసి అధ్యక్షురాలు దేవి ప్రసన్న, ఐవైసీ అధ్యక్షుడు చీకటి కార్తీక్ చేతుల మీదుగా బీఫామ్ అందజేశారూ.ఈ సందర్భంగా కోటేష్ మాట్లాడుతూ, తాను ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్నానని తెలిపారు. పార్టీ చేపట్టిన ప్రతి కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటూ ప్రజల మధ్య పార్టీ సిద్ధాంతాలను విస్తృతంగా ప్రచారం చేస్తూ ముందుకు సాగుతున్నానన్నారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని కోటేష్ తెలిపారు. అలాగే జిల్లా స్థాయిలో డిసిసి అధ్యక్షురాలు దేవి ప్రసన్న ఆధ్వర్యంలో పార్టీ బలోపేతానికి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఈ నాయకత్వం కార్యకర్తలకు మరింత ఉత్సాహం కలిగిస్తోందని ఆయన పేర్కొన్నారు.

తనకు అప్పగించిన 20వ డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ విజయానికి శక్తివంచన లేకుండా పనిచేస్తానని కోటేష్ స్పష్టం చేశారు. డివిజన్ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తానన్నారు. అలాగే తన డివిజన్‌లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ పార్టీ విజయానికి కృషి చేస్తానని తెలిపారు.

కాంగ్రెస్ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని కోటేష్ పేర్కొన్నారు. పార్టీ బలోపేతంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ 20వ డివిజన్‌ను అభివృద్ధి దిశగా తీసుకెళ్తానని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొని బానోతు కోటేష్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రతి కార్యకర్త ఐక్యంగా కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.