Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 03 February 2026, 4:17 am Posted by : laxman RAO

ఒక్క అవకాశం ఇవ్వండి…

– ఎన్నికల ప్రచారంలో బిజెపి అభ్యర్థి దేవులపల్లి విద్యసాగర్ 

పరివర్తన అవాజ్:-కొత్తగూడెం  బిజెపి పార్టీ మద్దతుతో రాష్ట్ర నాయకులు జీవీకే మనోహర్ ఆశీస్సులతో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 58వ డివిజన్ లో పోటీ చేస్తున్న విద్యాసాగర్ కార్పొరేటర్ స్థానానికి తాను పోటీ చేస్తున్నానని ఒక్క అవకాశం ఇచ్చి గెలిపి స్తే మన 58వ డివిజన్ అభివృద్ధి చేస్తానని దేవులపల్లి విద్యసాగర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం తను పోటీ చేస్తున్న 58 వ డివిజన్ లో ఓటర్లను కలుసుకొని కమలం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. దివిజన్ లో నెలకొన్న సమస్యల పరిష్కారంతోపాటు ప్రభుత్వం నుండి మరిన్ని నిధులు తీసుకొచ్చి మున్సిపల్ కార్పొరేషన్ లో నెంబర్ వన్ డివిజన్ గ నిలబెడతానని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరితో స్నేహపూర్వకంగా ఉంటూ మీ అందరి సమస్యలు ఓపికగా తెలుసుకుని వాటిని కచ్చితంగా పరిష్కరిస్తానని రోడ్లు డ్రైనేజీ సమస్యలతో పాటు వీధిలైట్ల ఏర్పాటు కోసం కృషి చేస్తానని అన్నారు. ప్రభుత్వం మంజూరు చేసే నిధులతో పాటు ప్రత్యేక నిధులను కూడా రాబట్టి మన 58వ దివిజన్ ను మరింత అభివృద్ధి చేసుకుందామని అన్నారు.ఈ ప్రచార కార్యక్రమం లో మురళి,ఎంకిరణ్,గాంధీ,రవీందర్,సంధ్యా,
ప్రియాంక,శ్రీలత, కవిత,శోభ,లక్ష్మి.