ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి :
జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరరావు. పరివర్తన అవాజ్,కొత్తగూడెం:-జిల్లాలో నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ వార్షిక ప్రయోగ పరీక్షలను పకడ్బందీగా, నిబంధనల ప్రకారం నిర్వహించాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షలు సజావుగా కొనసాగుతున్న నేపథ్యంలో మంగళవారం ఆయన ములకలపల్లి, అశ్వరావుపేట మండలాల్లోని పలు జూనియర్ కళాశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ములకలపల్లి మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించి ప్రయోగ పరీక్షల నిర్వహణ విధానం, ప్రయోగశాలల ఏర్పాట్లు, విద్యార్థుల హాజరు నమోదు, ప్రశ్నపత్రాల...