Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 01 February 2026, 1:12 pm Posted by : laxman RAO

అధికారం కోసం కాదు… ప్రజాసేవ కోసమే!

 

 

59వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా ఎండీ. హుస్సేన్ ఖాన్ నామినేషన్ దాఖలు

పరివర్తన అవాజ్,కొత్తగూడెం:-కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలో 59వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా స్థానిక యువ నాయకుడు ఎండీ. హుస్సేన్ ఖాన్ శుక్రవారం అధికారికంగా తన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించారు.

నామినేషన్ అనంతరం ఎండీ. హుస్సేన్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ, గత రెండు దశాబ్దాలుగా కుల, మత, రాజకీయాలకు అతీతంగా ప్రజాసేవలో నిమగ్నమై ఉన్నానని తెలిపారు. ముఖ్యంగా పేద మరియు మధ్యతరగతి విద్యార్థులకు ఉపకార వేతనాలు అందేలా చేయడంలో, అలాగే యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మార్గనిర్దేశం చేయడంలో నిరంతరం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

తనను 59వ డివిజన్ ప్రజలు గెలిపిస్తే, ప్రజలకు అందుబాటులో ఉంటూ నిత్యం వారి మధ్యనే ఉండి సమస్యల పరిష్కారానికి అహర్నిశలు శ్రమిస్తానని ఆయన హామీ ఇచ్చారు. డివిజన్ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

అలాగే ప్రజల నమ్మకాన్ని ఆశీర్వాదంగా భావించి, ప్రజాసేవ కోసం ముందుకు వచ్చిన తనను ఆశీర్వదించి గెలిపించాలని ఈ సందర్భంగా డివిజన్ ఓటర్లను ఎండీ. హుస్సేన్ ఖాన్ విజ్ఞప్తి చేశారు.