53వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా పల్లపు వెంకటేశ్వర్లు నామినేషన్

ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రం అందజేత కొత్తగూడెం, పరివర్తన అవాజ్ : కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 53వ డివిజన్‌కు కాంగ్రెస్ పార్టీ తరఫున కార్పొరేటర్ అభ్యర్థిగా పల్లపు వెంకటేశ్వర్లు గురువారం అధికారికంగా నామినేషన్ పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎన్నికల అధికారికి తన నామినేషన్ పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పల్లపు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల మధ్యకు తీసుకెళ్లడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. అలాగే 53వ డివిజన్ పరిధిలోని...