20 ఏళ్ల ఉద్యమం నుంచి కార్పొరేషన్ పోరుకు కురిమెల్ల శంకరయ్య 25 వ వార్డు బీఎస్పీ  అభ్యర్థిగా నామినేషన్

పరివర్తన ఆవాజ్ :-కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 25వ జనరల్ వార్డు నుంచి బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థిగా కురిమెల్ల శంకరయ్య నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ ప్రక్రియ పూర్తి అయిన అనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆయనకు ధృవపత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా కురిమెల్ల శంకరయ్య మాట్లాడుతూ, గత 20 సంవత్సరాలుగా దేశంలో బీసీలకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తూ ఉద్యమ మార్గంలో పోరాటం చేస్తున్నానని తెలిపారు. బీసీలకు రాజకీయ అధికారం సాధించాలంటే బహుజన్ సమాజ్ పార్టీ ద్వారానే సాధ్యమని నమ్మి పార్టీలో చేరి, కార్పొరేషన్...