Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 26 January 2026, 5:24 am Posted by : laxman RAO

విద్యానగర్ కాలనీ బైపాస్ రోడ్డులో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

పరివర్తన అవాజ్,కొత్తగూడెం:విద్యానగర్ కాలనీ బైపాస్ రోడ్డులో గణతంత్ర దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కే. సాంబశివరావు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారత రాజ్యాంగ విలువలను ప్రతి పౌరుడు గౌరవించాలని, దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో చుంచుపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ శాంతి శ్రీ, సీపీఐ చుంచుపల్లి మండల కార్యదర్శి, ఉపసర్పంచ్ వాసిరెడ్డి మురళి, వార్డు సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

జాతీయ గీతాలాపనతో పాటు నిర్వహించినారూ. ప్రజల విస్తృత భాగస్వామ్యంతో గణతంత్ర దినోత్సవ వేడుకలు విజయవంతంగా ముగిశాయి.