రామవరం జామియా మసీద్ ఆవరణలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

    పరివర్తన అవాజ్,కొత్తగూడెం:-రామవరం జామియా మసీద్ ఆవరణలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రామవరం ప్రముఖ వస్త్ర వ్యాపారి సయ్యద్ అబ్దుల్ నజీర్ జాతీయ జెండాను ఎగురవేసి ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కవిత రూపంలో యువతకు సందేశం ఇస్తూ మతసామరస్యం, పరమత సహనం పాటిస్తూ కులమత భేదాలను విడనాడి దేశ అభివృద్ధికి ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం శ్రీశ్రీ కళావేదిక తెలుగు అసోసియేషన్, ఆఫ్...