Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 22 January 2026, 6:02 am Posted by : laxman RAO

రాబోయే ఎంపీటీసీ ఎలక్షన్లో భాగంగా చుంచుపల్లి మండలం నందా తండా గ్రామపంచాయతీ నుంచి

మాలోత్ భీముడు ఎన్నికల బరిలోకి

పరివర్తన అవాజ్,కొత్తగూడెం

చుంచుపల్లి మండలం నందా తండా గ్రామపంచాయతీ వాస్తవ్యుడురాబోయే ఎంపీటీసీ ఎలక్షన్లో భాగంగా చుంచుపల్లి మండలం నందా తండా గ్రామపంచాయతీ నుంచిపోటీ చేయనున్నట్లు ప్రకటించారు. పేదల పక్షాన నిలబడి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, గ్రామ సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందుండే వ్యక్తిగా మాలోత్ భీముడు గ్రామస్తుల మధ్య మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.విద్యావంతుడిగా, అవినీతికి దూరంగా ఉంటూ ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తున్నానని పేర్కొన్న ఆయన, గ్రామపంచాయతీలో ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారం చూపే బాధ్యతను భుజాన వేసుకుంటానని తెలిపారు. తండా అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, యువతకు ఉపాధి అవకాశాలు, పేదల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.గ్రామ పెద్దలు, యువత, మహిళలు తనను ఆశీర్వదించి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కోరిన మాలోత్ భీముడు, తనకున్న మెజార్టీతో గెలిపిస్తే గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేస్తానని తెలిపారు. ప్రజల నమ్మకమే తన బలం అని, ఆ నమ్మకాన్ని ఎప్పటికీ నిలబెట్టుకుంటానని ఆయన స్పష్టం చేశారు.గ్రామ అభివృద్ధి కోసం నిజాయితీగల నాయకత్వం అవసరమని భావిస్తున్న గ్రామస్తులు మాలోత్ భీముడి నిర్ణయాన్ని స్వాగతిస్తూ, ఆయనకు మద్దతు తెలిపేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.